జిల్లా వీరశైవ సమాజం అధ్యక్షుడు చేతుల మీదుగా బసవ భవన్ శంకుస్థాపన గోడ పత్రిక ఆవిష్కరణ
జిల్లా ఆధ్యక్షుడి చేతుల మీదుగా బసవ భవన్ శంకుస్థాపన గోడ పత్రిక ఆవిష్కరణ :రాయికోడ్ మండల కేంద్రములో గల వీరభద్రశ్వర దేవాలయ ప్రాగణం లో సంగారెడ్డి జిల్లా వీరశైవ సమాజం అధ్యక్షుడు మధు శేఖర్ చేతుల మీదుగా బసవ భవన్ శంకుస్థాపన గోడ పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ కృషి తోని తెలంగాణ ప్రభుత్వం ఒప్పించి వీరశైవ లింగాయత్ లకు కూడా రాష్ట్ర రాజధాని లోని కొకపేట లో ఒక ఎకరం స్థలం మరియు పది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆస్థలం లో భవన నిర్మాణానికి అక్టోబర్ 2వ తేదిన భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావున రాయికోడ్ మండలం నుండి పెద్ద ఎత్తున భూమి పూజ కార్యక్రమం కు హాజరు అయి విజయవంతం చేయాలనీ విజ్ఞప్తి చేయడం జరిగింది.రాష్ట్ర బసవ దళ్ అధ్యక్షుడు శంకర్ పాటిల్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం కు తప్పకుండ హాజరు కావాలని, మనందరం స్వంత వాహనాలో వెళ్లి మన సమాజం ఐక్యత ను చాటి చెప్పాలని కోరడమైనది. ఇ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ మంజుల, రాయికోడ్ మండలం వీరశైవ లింగాయత్ అధ్యక్షులు సుధీర్ కుమార్ పాటిల్, ఝరాసంగం మండలం అధ్యక్షుడు శ్రీశైలం పాటిల్, బసవ దళ యువత రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కుమార్,జిల్లా సర్పంచ్ ఫోరమ్ ఉప అధ్యక్షుడు సంగమేశ్వర్ పాటిల్, సింగీతం సర్పంచ్ సంతోష్ పాటిల్, పిపడపల్లి సర్పంచ్ అనిల్, రాయికోడ్ సర్పంచ్ కేదారినాథ్, ఎంపీటీసీ మొగులప్ప, సభ్యులు సంగమేశ్వర్ పాటిల్, కుమార్,తదితరులు పాల్గొన్నారు.