జిల్లా సదస్సును జయప్రదం చేయాలి

 

 

 

 

 

 

 

 

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): రాష్ట్రీయ విద్యార్ధి సేన పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 19న నిర్వహించనున్న జిల్లా సదస్సును జయప్రదం చేయాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బంటు సందీప్ పిలుపునిచ్చారు.జిల్లా కేంద్రంలోని సాయి త్రివేణి డిగ్రీ కళాశాలలో సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.అనేక ఉద్యమాల ద్వారా సాధించుకున్న స్వరాష్ట్రంలో కార్పోరేట్ విద్యను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.ఇప్పటికే విద్యార్థులు లేరన్న సాకుతో సర్కార్ బడులను మూసి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయాలని కోరారు.బడ్జెట్ లో 30 శాతం నిధులను విద్యా రంగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా ఉపాధ్యక్షులు ధరావత్ తరుణ్ , జిల్లా కార్యదర్శి ధరావత్ దినేష్ , పట్టణ అధ్యక్షులు బాలగొని శివసాయి , ఉపాధ్యక్షులు సిలోజు గౌతమ్, నాయకులు ప్రశాంత్ , రాకేష్ , ఉపేందర్, సందీప్, త్రిషా, మనీషా, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.