జీవీకే ను పెళ్లికి ఆహ్వానించిన సర్పంచ్ల ఫోరం

 

 

 

 

 

 

సైదాపూర్ జనం సాక్షి డిసెంబర్12కరీంనగర్ సుడా చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీకే రామకృష్ణారావును మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చంద శ్రీనివాస్ కుమార్తె వివాహానికి సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో ఆహ్వానించారు. ఈనెల 14న ఫోరం అధ్యక్షులు చంద శ్రీనివాస్ కుమార్తె సాహితీ వివాహము సాయి ప్రణీత్ తో హుస్నాబాద్ లోని శుభం గార్డెన్లో వేద పండితుల మధ్య జరగనుంది. ఈ వివాహానికి తప్పనిసరిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని వారు కోరారు. ఈ సందర్భంగా మానకొండూరు మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో కలిసి జీవికేను గజమాలతో సత్కరించి పెళ్లి పత్రికను అందించారు. జీవీకేను కలిసిన వారిలో సర్పంచ్ల ఫోరం మండల ప్రధాన కార్యదర్శి కాయిత రాములు, మాజీ జెడ్పిటిసి సభ్యులు బెదరకోట రవీందర్ లు ఉన్నారు.