జూనియర్ కళాశాలలో జాతీయసమైక్యత దినోత్సవం.

బూర్గంపహాడ్ అక్టోబర్ 31 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ జి చీన్యా అధ్యక్షతన ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశపు ఉక్కుమనిషి అని
1875 అక్టోబర్ 31న, నాడియడ్ లో ఒక చిన్న గ్రామంలో జన్మించారని, ఆయన తండ్రి జవహర్ బాయ్ పటేల్, తల్లి లాడ్ బాయ్, చిన్నరైతు సాధారణ కుటుంబమన్నారు. భారత స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన సామాజిక, రాజకీయ నాయకుడు వల్లభాయ్ పటేల్ స్వతంత్ర భారతదేశ సమగ్రతకు, సమైక్యతకు మార్గ నిర్దేశం చేసిన మహనీయుడని, ఆయనను భారత దేశ ఉక్కుమనిషి సర్దార్ అని పిలుస్తారని, సర్దార్ అంటే నాయకుడు అని అర్థం అంటు తెలిపారు. 565 కు పైగా సంస్థానాలను బ్రిటిష్ వలస రాష్ట్రాలను కలిపి సమైక్య భారతదేశంగా మార్చే బాధ్యతను ఆయన తీసుకున్నారని విద్యార్థులకు వివరించారు. సినియర్ అద్యాపకులు సిహెచ్ నాగేశ్వరావు మాట్లాడుతూ భారతదేశ సమైక్యతకు మార్గం చూపినది సర్దార్ వల్లభాయ్ పటేల్ బహుముఖ నాయకత్వం. ఆయన సుపరిపాలన బావనే స్వరాజ్, ఆ భావన స్వాతంత్ర్యానంతర భారతదేశ నిర్మాణo లో కీలకపాత్ర పోషించింది. ఎప్పుడూ సమైక్య మంత్రమే జపించే ఆయన భారతదేశ రైతులను సమీకరించడంలోనూ, స్వాతంత్య్ర పోరాటంలో వివిధ కులాలను చేర్చడంలోనూ సాధనంగా మారారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర భారత తొలి హోంశాఖ మంత్రి, స్వాతంత్ర్యనంతరం సమైక్య భారత నిర్మాత, సర్దార్ వల్లభాయ్ పటేల్ కు గాంధీజీతో చాలా అనుబంధం కలిగి ఉన్నారని, ఆయనిని అన్నయ్యగా గురువుగా భావించారని, మహాత్మా గాంధీ తన అన్ని పనుల్లో ఆయనను ప్రోత్సహించారు. గాంధీజీ మరణం అతనిని విచ్చిన్నం చేసింది, 1950 డిసెంబర్ 15న ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన మరణ వార్త ప్రపంచమంతా వ్యాప్తించి దేశం మొత్తం తీవ్ర దుఖం లో మునిగిపోయిందని, రోజువారి జీవితం నిలిచిపోయింది. కృతజ్ఞత గల దేశం ప్రియమైన నాయకుడుకి కన్నీటి నివాళులర్పించింది, 1991లో భారత ప్రభుత్వం భారతరత్న గౌరవాన్ని ప్రధానం చేసిందని విద్యార్థులకు వివరించారు. తరువాత కళాశాల విద్యార్థుల చేత జాతీయ సమైక్యత దినోత్సవ ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ పి ఓ. జి.శ్రీనివాస్ అద్యాపకులు ఎన్ ఎస్ కుమార్, సుమన్ కుమార్, డి.శ్రీనివాస్, ముకుందం, సాహితీ, నరేష్, జె.శివప్రసాద్, డి.శ్రీను, నాన్ టీచింగ్ స్టాప్ విద్యార్థులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు