జూన్‌లో పంచాయితీ ఎన్నికలు: సీఎం
హైదరాబాద్, జనంసాక్షి: ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఆపే సమస్య లేదని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. జూన్ మూడో వారంలో పంచాయితీ ఎన్నికలు, ఆగస్ట్ మూడో వారంలో మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఐక్యమత్యంగా ఉండి ఎన్నికలు ఎదుర్కొంటమన్నారు. నాయకులు పోతే పార్టీకి ఏమీ నష్టం ఉండదన్నారు. పాత నీళ్లు పోతేనే కొత్త నీళ్లు వస్తాయని ఆయన అన్నారు.