జూన్ రెండో వారంలో నైరుతి రుతుపవనాలు
హైదరాబాద్,(జనంసాక్షి): త్వరలో రాష్రాన్ని నైరుతి పలుకరించనుంది. జూన్ రెండో వారంలో రాష్ట్రంలోకి నైరుతి పవనాలు ప్రవేశించే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు నైరుతి రుతుపవనాలు మరో మూడు రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నట్లు వెల్లడిరచారు.