జూన్‌ 8,9 తేదీల్లో చేపమందు పంపిణీ

హైదరాబాద్‌ : జూన్‌ 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. జూన్‌ 8 మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 9 వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట వరకు దీన్ని పంపణీ చేస్తామన్నారు. చేప ప్రసాదంపై జనవిజ్ఞాన వేదిక దుష్ప్రచారం చేస్తోందని బత్తిని హరినాథ్‌గౌడ్‌ ఆరోపించారు. ఔషధ కంపెనీల నుంచి డబ్బులు తీసుకుని జన విజ్ఞాన వేదిన తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు.