జూలైలోగా నష్టపరిహారం చెల్లిస్తామన్న ఆర్డీవో
మంథనీ గ్రామీణం: సింగరేణి ఉపరితల గని-2 విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న అక్కేపల్లి గ్రామస్థులకు జూలైలోగా నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని భూసేకరణ అధికారి, మంథని ఆర్డీవో అయేషా నుస్రత్ ఖానం తెలిపారు. భూ సేకరణ సర్వేను అడ్డుకున్న గ్రామస్థులతో ఆర్డీవో గురువారం సమావేశమై లబ్ధిదారులకు నష్టం వాటిల్లకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకారం నష్టపరిహారం చల్లింపుతో పాటు నిరుద్యోగులకు ఉపాధికల్పన కోసం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో తహశీల్దారు గంగయ్య, భూ సేకరణ విభాగం డిప్యూటీ తహశీల్దార్లు శివరాం, లక్ష్మీనారాయణ, సింగరేణి ఎస్టేట్ అధికారి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.