జెడ్పీ హైస్కూల్లో సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపి ధర్నా-వినతిపత్రం.
తొర్రూరు 18అక్టోబర్ (జనంసాక్షి ) మండల కేంద్రము లో జెడ్పీ హైస్కూల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏబీవీపి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి
అనంతరం డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపి తొర్రూరు పట్టణ కార్యదర్శి గంగాధర సిద్దు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రసిద్ధి గాంచిన తొర్రూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేడు సమస్యలకు నిలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.వాటర్ ట్యాంకుల్లో నాచు పేరుకుపోయిచెత్తా చెదారం తో ఉండడం వల్ల విద్యార్థులు ఆ నీటిని తాగకుండా దగ్గర లో ఉన్న షాపులో త్రాగునీరు కొనుక్కుని తాగుతున్నారు అని, మధ్యాహ్న భోజనం అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల రుచికరంగా,నాణ్యత లేకుండా ఉంటుందని, ప్రభుత్వం నుంచి విద్యార్థులకు ఇంతవరకూ యూనిఫామ్ అందించలేదని వెంటనే విద్యార్థులకు యూనిఫామ్ అందించాలని కోరారు.మూత్రాశయాలు , మరుగుదొడ్లు విద్యార్థులకు ముఖ్యంగా మెగా విద్యార్థులకు సరిపడా లేకపోవడం వల్ల పాఠశాల ఆవరణలో నే విద్యార్థులు మూత్ర విసర్జన చేస్తున్నారు అని, వెంటనే విద్యార్థులకు సరిపడా టాయ్ లెట్ లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.జెడ్పీ హైస్కూల్ కాంప్లెక్స్ ద్వారా లక్షలాది రూపాయలు ఆదాయం ఉన్నా కూడా పాఠశాల అభివృద్ధికి రూపాయి కేటాయించక పోవడం దారుణమని కాంప్లెక్స్ ద్వారా వచ్చే ఆదాయం పాఠశాల అభివృద్ధికి కేటాయించి తొర్రూరు ఉన్నత పాఠశాల పునర్ వైభవానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విద్యా శాఖ అధికారులు స్పందించి పాఠశాలపై నిరంతరం ప్రత్యేక చొరవ చూపి అభివృద్ధి కి క్రృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపి నాయకులు శివ, శ్రీకాంత్, గణేష్, మహేష్,సాయి,ఉదయ్, శేఖర్,సిద్దు తదితరులు పాల్గొన్నారు.