జేఏసీ చలో అసెంబ్లీకి మద్దతు :నారాయణ

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి సీసీఐ మద్దతు తెలిపింది. కాంగ్రెస్‌ అవకాశవాదాన్ని బయటపెట్టడానికే చలో అసెంబ్లీ అని, ఈ కార్యక్రమానికి తమ మద్దతు ఉంటుందని ఆపార్టీ కార్యదర్శి నారాయణ గురువారమిక్కడ తెలిపారు. మోసం చేస్తున్న నాయకులను ప్రజలు తరిమికొడతారని ఆయన వ్యాఖ్యానించారు.