జ్యాపి స్టూడియోను ప్రారంభించి అనిల్ రావిపూడి
’తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది.. కోవిడ్‌కి ముందు పరిస్థితుల కోసం అందరూ ఫైట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ’జ్యాపి స్టూడియోస్’ నిర్మిస్తున్న నాలుగు సినిమాలూ మంచి విజయాలు సాధించాలి‘ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్ వెబ్ పోర్టల్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్ ’జ్యాపి’ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ’జ్యాపి’ యాప్‌ని రూపొందించిన ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే, కృష్ణ గొర్రెపాటి స్థాపించిన ’జ్యాపి స్టూడియోస్’ బ్యానర్‌ని దర్శకుడు అనిల్ రావిపూడి లాంచ్ చేశారు. ’జ్యాపి స్టూడియోస్’ నిర్మాణంలో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న తొలి చిత్రం ’జగమే మాయ’ పోస్టర్‌ని నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ రిలీజ్ చేశారు. ఆ సంస్థ నిర్మిస్తున్న రెండో చిత్రం ’పతంగ్’ పోస్టర్‌ని దర్శకుడు అనుదీప్ విడుదల చేయగా, మూడో సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నారు. సుహాస్ ప్రధాన పాత్రలో రూపొందనున్న నాలుగో చిత్రం పోస్టర్‌ని ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామక్రిష్ణ లాంచ్ చేశారు. ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే, కృష్ణ గొర్రెపాటి మాట్లాడుతూ? ‘ప్రస్తుతం నిర్మాణం అంటే ఒక సవాల్‌గా మారిన పరిస్థితి. అయితే ఈ పరిస్థితులు త్వరలోనే సర్దుకుంటాయని ఆశిస్తున్నాం‘ అన్నారు. నటీనటులు ధన్యా బాలకృష్ణ, రాజ్ తరుణ్, సుహాస్ తదితరులు పాల్గొన్నారు.