జ్వరంతో గిరిజన విద్యార్థి మృతి
ఆదిలాబాద్
మండలంలోని మాణిక్యాపూర్ కస్తూర్బా పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న రాజుబాయి(13) అనే గిరిజన విద్యార్థిని సోమవారం అర్ధరాత్రి జ్వరంతో చనిపోయింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గత 15 రోజుల క్రితం జ్వరం రావడంతో ఇంటికి తీసుకెళ్లి తిర్యాణిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే రాజుబాయి మృతి చెందినట్లు తెలిపారు.