– జ్వరాల బారిన పడుతున్న విద్యార్థులు
– జాగ్రత్తలు పాటించాలన్న వైద్యులు
చండ్రుగొండ జనంసాక్షి (జూన్ 28) మండలంలో నాలుగవ దశ కోవీడ్ కేసులు పెరుగుతున్నాయి. చాపకింద నీరులా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.గత రెండు రోజుల క్రితం బాలి కుంట గ్రామానికి చెందిన పదిహేనేళ్ల అమ్మాయి జ్వరం జలుబు దగ్గు తో బాధపడుతూ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు . వైద్యులు సంబంధిత పరీక్షలు చేసి కోవిడ్ లక్షణాలుగా గుర్తించారు. దాంతో అప్రమత్తమైన వైద్యాధికారులు సిబ్బందితో కలిసి మంగళవారం స్థానిక కేజీబీవీ లో 62మంది విద్యార్థులకు కరోన పరీక్షలు నిర్వహించారు. వారిలో ముగ్గురికి పాజిటివ్ గా గుర్తించామని వైద్య అధికారి వెంకట ప్రకాశ్ తెలిపారు. సంబంధిత మెడికల్ కిట్లు ఇచ్చి తగు జాగ్రత్తలు సూచించడం జరిగిందన్నారు. మరో 15మంది విద్యార్థులు జలుబు దగ్గు తో బాధపడుతున్నారని అన్నారు.ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. అప్రమత్తంగా ఉండాలన్నారు.