ఝర్ఖండ్‌లో ఘోరం
– ఆలయంలో తొక్కిసలాట
– 11మంది మృతి
ఆలయంలో తొక్కిసలాట….11మంది మృతి
రాంచీ,ఆగస్ట్10(ఆర్‌ఎన్‌ఎ): గోదావిరి పుష్కరాల తొక్కిసలాట ఘటన మరువక ముందే ఝార్ఖండ్‌లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. రాష్ట్రంలోని దియోగఢ్‌లో దారుణం జరిగింది. ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు ఒక్కసారాగి తోసుకుని రావడంతో జరిగిన తొక్కిసలాటలో కనీసం 11మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. దుర్గామాత ఆలయంలో సోమవారం తెల్లవారుజామున ఈ తొక్కిసలాట ఘటన చోటుచేఉకుంది. ఇందులో 11 మంది మృతిచెందారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. శ్రావణమాసం తొలి సోమవారం సందర్భంగా దుర్గామాతను దర్శించుకునేందుకు అర్థరాత్రి నుంచే భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామున ఆలయ ద్వారాలు తెరిచి దర్శనానికి అనుమతి ఇవ్వడంతో భక్తులంతా ఒకరి విూద ఒకరు పడి తొక్కిసలాట చోటుచేసుకుంది. క్షతగాత్రులను వెంటనే సవిూపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
మృతులకు ప్రధాని మోదీ సంతాపం
దియోగఢ్ తొక్కిసలాటపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దుర్ఘటనపై ఝార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్‌దాస్‌తో మాట్లాడినట్లు మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
తొక్కిసలాట ఘటన విచారకరం: ఝార్ఖండ్ సీఎం
తొక్కిసలాట ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువర్‌దాస్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యంఅందించాలని ఆయన అధికారులకు సూచించారు. పరిస్థితిని దగ్గరుండి సవిూక్షిస్తున్నట్లు ¬ంశాఖ కార్యదర్శి ఎన్‌ఎన్ పాండే తెలిపారు. తొక్కిసలాటలో మృతిచెందిన వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఓప్రకటనలో తెలిపింది. తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతిచెందగా.. 50 మందికి పైగా గాయపడ్డట్లు ప్రకటించారు. క్షతగాత్రులు సవిూపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.