టర్కీలో కుర్దు తిరుగుబాటుదారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణలు: 29 మంది మృతి
దియార్బకీర్(టర్కీ) : టర్కీలో కుర్దు తిరుగుబాటుదారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణల్లో 29 మంది చనిపోయారు. ఆదివారం రాత్రి నిషేధిత కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ సభ్యులు తుపాకులు, రాకెట్ లాంఛర్లతో టర్కీ ఆగ్నేయ ప్రాంతంలోని బెతుస్సేబావ్లో ఉన్న భద్రతా కాంప్లెక్సుపై దాడి జరిపారు. భద్రతా దళాలు ప్రతిదాడులకు దిగాయి. ఈ రెండు పక్షాల మధ్య ఘర్షణల్లో 20 మంది తిరుగుబాటు దారులు, తొమ్మిది మంది భద్రతా సిబ్బంది మరణించిఇనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కుర్ధిస్థాన్ వర్కర్స్ పార్టీ, టర్కీ భద్రతా బలగాల మధ్య 28 ఏళ్లుగా సాగుతున్న పోరులో 40 వేల మందికి పైగా చనిపోయారు.