*టిఆర్ఎస్వీ విస్తృతస్థాయి సమావేశానికి వెళ్లిన నేతలు*

మునగాల, అక్టోబర్ 11(జనంసాక్షి): కోదాడ అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగే టి.ఆర్.ఎస్వీ విస్తృతస్థాయి సమావేశానికి మండల టి.ఆర్.ఎస్వీ నేతలు తరలివెళ్లారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి శాఖమంత్రి కేటీఆర్ హాజరుకానున్నారని, ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి భవిష్యత్తు ప్రణాళికను గూర్చి చర్చించనున్నారని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదాడ టి.ఆర్.ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు షేక్  పాషా, పట్టణ అధ్యక్షుడు బొర్రా వంశి నాని, మునగాల మండల అధ్యక్షుడు బెల్లంకొండ ఉపేందర్, మోతె మండల అధ్యక్షుడు దోసపాటి నరేష్, నాయకులు తరుణ్ రెడ్డి, ఇమామ్, అసిఫ్, అనిల్, నరేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.