టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు అకర్షితులై పార్టీలో చేరికలు.

పార్టీ కండువ వేసి సాదరంగా ఆహ్వానం.
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 27(జనంసాక్షి)టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు అకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం
వికారాబాద్ జిల్లా తాండూరుమండలం మైసమ్మ గిరిజన తండాకు చెందిన 20 మంది. యాలాల మండలం పెర్కంపల్లి గ్రామానికి చెందిన 25 మంది వివిధ పార్టీల నుండి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో క్యాంప్ కార్యాలయంలో లో టీఆర్ ఎస్ పార్టీలో చేరారు.పార్టీ లో చేరిన వారు ఎస్.ఎం.సి ఛైర్మెన్ రవి గౌడ్, సురేష్ గౌడ్, వార్డు నెంబర్లు శ్రీనివాస్, నర్సింలు ,అశోక్ గౌడ్, సంతోష్, శివకుమార్, శ్రీరామ్, వీరు నాయక్, అరుణ్ ,ఆశప్ప, పెంటప్పలను ఎమ్మెల్యే పార్టీ కండువ వేసి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపానర్సింలు,మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ ,కౌన్సిలర్ సంగీత ఠాకూర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.