టిఆర్ఎస్ హయాంలోనే విద్యాభివృద్ధికి పెద్దపీట… – మన ఊరు మన బడి లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. – విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ… – ఎంపీపీ బక్క రాధా జంగయ్య ఊరుకొండ, జూన్ 13 (జనం సాక్షి):
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాభివృద్ధికి పెద్దపీట వేశారని ఎంపీపీ బక్క రాధ జంగయ్య, జెడ్ పి టి సి శాంతకుమారి రవీందర్ లు అన్నారు. సోమవారం విద్యాలయాల పునఃప్రారంభం సందర్భంగా గ్రామ సర్పంచ్ దండోద్కర్ అనితనాగోజి అధ్యక్షతన ఏర్పాటుచేసిన మన ఊరు మన బడి అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి ఎంపీపీ బక్క రాధ జంగయ్య, జడ్పిటిసి శాంతకుమారి రవీందర్ లు ముఖ్య అతిధులుగా హాజరై భూమి పూజ చేశారు. ప్రాథమిక పాఠశాలలో నీటి సంపు నిర్మాణానికి మరియు ఉన్నత పాఠశాల ఆవరణలో డైనింగ్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసి ప్రారంభించారు. క్రీడా ప్రాంగణానికి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ జడ్పిటిసి లు మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టిందని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని సూచించారు. విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ దండోద్కర్ అనితనాగోజి, మండల కో ఆప్షన్ నెంబర్ ఖలీల్ పాషా, ఎంపీటీసీ సభ్యురాలు ఈశ్వరమ్మ ముత్యాలు, టిఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు గిరి నాయక్, ఎం ఈ ఓ బాసు నాయక్, ఎంపీడీఓ ప్రభాకర్, ఎంపిఓ వెంకటేష్, ఏఈ హుస్సేన్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రావణ్ కుమార్, లక్ష్మణ్, గ్రామ వార్డు సభ్యులు రెపని శ్రీనివాసులు, సిద్దు, ఎస్ఎంసి చైర్మన్ లు జంగయ్య, అంజిరెడ్డి, ఉపాద్యాయులు, గ్రామ ప్రజలు, నాయకులు, యువకులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
13 ఊరుకొండ 01, ఊరుకొండ పేట లో మన ఊరు మనబడి కార్యక్రమం లో భూమి పూజ చేస్తున్న ఎంపీపీ, జడ్పిటిసి తదితరులు.
ReplyForward
|