టిఆర్‌ఎస్‌తోనే అన్నివర్గాలకు సమప్రాధాన్యం
రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన
మరోమారు గెలిపించాలని పద్మాదేవందర్ పిలుపు
మెదక్,నవంబర్14(జనంసాక్షి): గత పాలకులు కుల వృత్తులను విస్మరించారని టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని కుల వృత్తులవారికి సమ ప్రాధాన్యతనిచ్చారని మెదక్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. 24గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా అన్నవి అన్నదాతను ఒడ్డెక్కించే పథకాలన్నారు. దీంతో తెలంగాణ వ్యవసాయం పండగలా మారిందన్నారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టి ఆదర్శవంతంగా నిలిచిందన్నారు. నేత కార్మికులకు
పింఛన్‌లను మంజూరు చేసి సీఎం కేసీఆర్ ఆదుకున్నారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ సీఎం అయిన తరువాత అన్ని వర్గాల వారితో పాటు కుల వృత్తులకు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. బంగారు తెలంగాణెళి లక్ష్యంగా కేసీఆర్ అడుగు వేస్తున్నారని, మరోసారి టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమప్రాధాన్యతనిచ్చి ప్రజా సంక్షేమ కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందని అన్నారు. ప్రజలు మరోసారి ఆలోచించి తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్న టీఆర్‌ఎస్‌కు తమ పూర్తి మద్దతు తెలుపాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో కూటముల పేరుతో తెలంగాణ ప్రజలను మరొక్కసారి దగా చేయాలని చూస్తున్న కాగ్రెస్ నాయకులను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. కూటమికి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పాలన్నారు.



