టిఆర్‌ఎస్‌లోకి జోరుగా వలసలు
హైదరాబాద్,సెప్టెంబర్29(జనంసాక్షి): అధికార టీఆర్‌ఎస్ పార్టీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం మధన్‌పేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో యువత పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కొరిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ యువత అదేవిధంగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దతండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 150 మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, డా. సుధాకర్ రావు వీరందరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.