టిఆర్‌ఎస్ గెలుపును ఆపలేరు: వినయ్
వరంగల్,అక్టోబర్25 మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్(జనంసాక్షి): రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం మరోమారు ఏర్పాటు కాబోతున్నదని టిఆర్‌ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. అన్ని నియోజవవర్గా ల్లో తమ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని అన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తనను ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపిస్తారని అన్నారు. ప్రచార వ్యూహాలు, పాక్షిక మేనిఫెస్టో, భవిష్యత్ మేనిఫెస్టోతోపాటు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, భవిష్యత్‌లో చేపట్టనున్నవాటిపై ప్రజల్లో బాగా చర్చ జరుగుతోందని అన్నారు. ఎవరూ చేయని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. కులాలకు, మతాలకు ఎన్నో పథకాలను అడిగిన, అడగకున్నా, ఇచ్చిన, ఇవ్వని హావిూలను అమలుచేశారు. వాట న్నింటిని వివరిస్తూ పాక్షిక మ్యానిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పరిష్కరించిన ప్రభుత్వం.. అధికారంలోకి వస్తే మరిం తగా చేయూతనందిస్తుందనే విషయాన్ని చెబుతున్నామని అన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉన్న నమ్మకం, ప్రజల్లో ఉన్న విశ్వసనీయత తమను గెలిపిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మంచి అభివృద్ధి సాధించాం. ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోపాటు తనపై నియోజకవర్గ ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలు మరువ లేనివి. గడపగడపకు సంక్షేమ పథకాలను అందించాం. ఇళ్లల్లోని లబ్దిదారులను కలిసి గుర్తుచేస్తున్నాం అని వినయ్ భాస్కర్ వివరించారు.