టిఆర్‌ఎస్‌ గెలుపు చారిత్రక అవసరం

ఖమ్మం,నవంబర్‌6(జ‌నంసాక్షి): రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ గెలుపు చారిత్రక అవసరమని వైరా నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ మదన్‌లాల్‌ అన్నారు. కూటమి అభ్యర్థులకు ఓటేస్తే నోట్లో మట్టి కొట్టడం తప్పదన్నారు. ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే గత నాలుగు సంవత్సరాల కాలంలో గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగు, తాగు నీటి పథకాలు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన వారిని రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఓటు వేసేలా టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. విూలో ఒకడిగా ఉంటూ విూ సమస్యలను పంచుకున్న నన్ను తిరిగి ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. మంగళవారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకొని అధికారంలోకి రాగానే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హావిూ ఇచ్చారు. నాలుగు సంవత్సరాల క్రితం నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు ప్రతిపక్షాల ఊహకు అందని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌ పాలనను ఇతర

రాష్ట్రాలు మోడల్‌గా తీసుకుంటున్నాయని తెలిపారు. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాగిస్తున్న ప్రజారంజక పాలనే కారణమని తెలిపారు. ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవలం

బిస్తున్న మొండి వైఖరితో విభజన చట్టంలో కీలక అంశాలైన నీళ్లు, నిధులు, నియామకాలపై నేటికి ఇరురాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. కూటమితో మళ్లీ పెత్తనం చేయాలని బాబు చూస్తున్నాడని అన్నారు.