టిక్యా దేవమ్మ గూడెంకు 30 ఎల్ఈడీ లైట్ల అందజేసిన జడ్పీటీసీ

శివ్వంపేట సెప్టెంబర్ 29 జనంసాక్షి : తండాలో నెలకొన్న చీకట్లను పారద్రోలేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు స్థానిక జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా పేర్కొన్నారు. మండల పరిధిలోని టిక్యా దేవమ్మ గూడెం తండాలో చిమ్మ చీకట్లో నెలకొని ఉన్నాయని గ్రామస్తులు ఇటీవల జడ్పిటిసి తో మొరపెట్టుకున్నారు. దీనికి స్పందించిన జడ్పిటిసి తన సొంత డబ్బులు 50 వేల రూపాయలు వ్యచించి కొనుగోలు చేసి తీసుకువచ్చిన 30 ఎల్ఈడీ లైట్లు గ్రామ ప్రజల సమక్షంలోగురువారం అందజేశారు. అనంతరం తండావాసులు అడిగిన వెంటనే స్పందించిన తమ సమస్యను పరిష్కరించిన పబ్బ మహేష్ గుప్తకు ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోతు తూక్య మాజీ జెడ్పిటిసి కమలా పూల్ సింగ్, ఉప సర్పంచ్ ప్రకాష్, శ్రీనివాస్, నాయకులు రాజేందర్ మదన్ లాల్, కిషన్, పూల్ సింగ్, నరేష్, శ్రీనివాస్ లతోపాటు తాండవాసులు పాల్గొన్నారు.