టిడిపి ధర్నా, రాస్తారోకో
సంగారెడ్డి, జూలై 19 : విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణ టిడిపి ఆధ్వర్యంలో 20 మంది కార్యకర్తలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి ర్యాలీగా రోడ్డు రవాణా సంస్థ మేనేజర్ కార్యాలయం ముందు రాస్తారోకో నిర్వహించారు. ఐదు నిమిషాలలో రోడ్డు కిరువైపుల వాహనాలు నిలువడంతో రూరల్ సిఐ రామకృష్ణ, ఎస్‌ఐ భరత్ ఆందోళన కారులను వెళ్లల్సిందిగా ఆదేశించడంతో ఆందోళనకారులు పార్టీ పతాకాలు చేబూని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ఆర్డీవో కార్యాలయం చేరుకొని సూపరింటెండెంట్‌కు వినతి పత్రం సమర్పించారు. 9గంటల కరెంటు సరఫరా చేయాలని, పెంచిన సర్వీస్ ఛార్జీలను తొలగించాలని, కరెంటు కోత ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.