టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై చేయిచేసుకున్న ఖాకీలు
ఆదిలాబాద్, జనంసాక్షి: సీమాంధ్ర పార్టీలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. విధిలో ఉన్న పోలీసులు అకారణంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమ్మయ్యపై పోలీసులు చేయి చేసుకున్నారు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల తీరుపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయమ్మకు, పోలీసులకు వ్యతిరేకంగా తెలంగాణవాదులు నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై బుధవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేస్తామని సమ్మయ్య తెలిపారు.