టీఆర్‌ఎస్ ప్రణబ్‌కు ఓటేస్తే
తెలంగాణకు ద్రోహం చేసినట్టే : చాడ
కరీంనగర్, జూన్ 27 (జనం సాక్షి) : రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ ప్రాంత నాయకులు మద్దతిస్తే తెలంగాణకు ద్రోహం చేస ినట్లేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 9 డిసెంబర్ 2009 వెలువడిన తెలంగాణ ప్రకట నను వెనుకకు తీయించేందుకు మూలకారణం ప్రణబ్ ముఖ ర్జేనని, అలాంటి వ్యక్తికి తెలంగాణ లోని ఏ పార్టీకి సంబం ధించిన వారైనా మద్దతు తెలిపితే తెలంగాణాకు ద్రోహం చేసినవారవు తారన్నారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధిం చిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు తెలంగాణ అంశం వేడెక్కిన తరుణంలో చర్చల పేరుతో అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతూ తెలంగాణ కు వ్యతిరేకి ప్రణబ్ ముఖర్జీని బలపర్చటం సిగ్గు చేటన్నారు. రాష్ట్రం ఓ వైపు రావణకాష్టంలా కాలిపోతుంటే ఉప ఎన్నికల పేరుతో కాల యాపన చేసిన కాంగ్రెస్ ప్రజల చేతులో భంగపాటుకు గురైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో దేశంలో అనేక కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయని, పలువురు మంత్రులు జైళ్ళలో ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నా రు. యూపీఏ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేం దుకు సీపీఐ అనేక పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగి వందలాది మంది విద్యార్థులు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎంతమంది బలిదానం చేసుకుం టే సోనియమ్మ తెలంగాణను ప్రకటిస్తుందని ధ్వజమెత్తారు. తెలంగాణ అంశంలో ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో వేసిన కమిటీ ఇప్పటి వరకూ స్పష్టమైన రిపోర్టు అందించలేదన్నారు. తెలంగాణపై తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులకు స్పష్టమైన వైఖరి ఉంటే రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని కిరణ్‌కుమార్ ముఖ్యమంత్రిగా పరిపాలించే నైతిక హక్కు లేదన్నారు. అవినీతి వ్యవహారాల్లో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ అవినీతిని వెలికితీస్తున్న అధికారులను బదిలీ చేస్తూ తమకు వత్తాసు పలికే అధికారులను నియమిస్త్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని వెంకటరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయిందని, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడం లేదన్నారు. మద్యం సిండికేట్ల జాబితాలను వెలికితీస్తే మొదటగా జైళ్ళో ఊచలు లెక్కపెట్టేది బొత్స సత్యనారాయణే అన్నారు. అలాంటి అవినీతి నాయకులు మద్యాన్ని వేలం వేస్తూ పేద ప్రజల బతుకులను ఛిద్రం చేస్తున్నారన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో విత్తనాల పంపిణీ విషయంలో ప్రభుత్వానికి సరైన ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు రోడ్లపైకి రావాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో రైతాంగానికి 13.87 లక్షల క్వింటాళ్ళ వివిధ పంట విత్తనాలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించినా జూన్ 16 వరకు కేవలం 5.55 క్వింటాళ్ళ విత్తనాలు మాత్రమే పంపిణీ చేశారని రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. పరకాల ఉప ఎన్నికల్లో టీిఆర్‌ఎస్ గెలుపునకు సీపీిఐ కృషి చేసిందన్నారు. 70 సంవత్సరాల చరిత్ర ఉన్న సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో పోరాటాలు చేసి హక్కులు సాధించుకున్నామని ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఏఐటియూసీకిి మద్దతు ఇవ్వకుండా పోటీ చేయడం అవివేకమన్నారు.ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి కూడా పాల్గొన్నారు.