టీఆర్‌ఎస్‌ విజయం ఖాయం : శంకర్రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని మాజీ మంత్రి శంకర్రావు జోష్యం చెప్పారు. ఇవాళ ఆయన అసెంబ్లీ లాయీల్లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన సరే సీమాంధ్రలో వైఎస్సార్సీపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీలు ఘన విజయం సాధిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ కన్నా కాంగ్రెస్‌ పార్టీ బలహీనమవుతుందని అన్నారు. ప్రజలతో సంబంధంలేని వారందరికీ పీసీసీలో స్థానం కల్పించారని విమర్శించారు. సీఎం తమ్ముడికి ఏపీపీఎస్సీ కుంభకోణంతో సంబంధాలున్న సంధ్యారాణికి మధ్యకొన్ని వందలసార్లు సంభాషణలు నడిచాయని ఆరోపించారు.