టీఎంయూ గెలుపు ఖాయం : హరీష్‌రావు
మెదక్: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూ విజయం ఖాయమైందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ కార్మికులంతా సంసిద్ధమై ఉన్నారని ఆయన తెలియజేశారు. సకల జనుల సమ్మెకాలంలో ఎస్‌ఎంయూ నేతలు కాంగ్రెస్‌కు అమ్ముడుపోయి.సమ్మెనే నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఆర్టీసీ ఎన్నికల్లో ఎన్‌ఎంయూకు డిపాజిట్లు కూడా దక్కవని ఆయన జోష్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హరీష్‌రావు హామీనిచ్చారు.