టీఎస్‌పీఎస్సీ ఎదుట టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆందోళన

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 జ‌నంసాక్షి : తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుటు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలన కొనసాగుతోందని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు ఆరోపించారు. ఉద్యోగాలు ఇవ్వాలంటూ డప్పు చాటింపు వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసీఆర్‌ నియంతృత్వ పోకడలకు భయపడమని నిరుద్యోగులు స్పష్టం చేశారు.