టీచర్లకు మంత్రి సత్యవతి రాథోడ్ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
విద్యావిధానంలో దేశానికే తెలంగాణ తలమానికంగా నిలవాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక గురుకులాలు తెలంగాణలోనే
భారతీయ సంప్రదాయంలో దేవుడితో సమానమైన స్థానం గురువులకు ఉంది.
పిల్లలను బాధ్యతాయుత పౌరులుగా మార్చడంలో ఉపాధ్యాయుల కృషి గొప్పది.
మంత్రి సత్యవతి రాథోడ్
మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ( సెప్టెంబర్ 5 )ని పురస్కరించుకుని, నిర్వహించుకునే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు.
విద్య ద్వారానే మానవ వనరులు అభివృద్ధి అవుతాయని, మానవ వనరుల ద్వారానే బంగారు తెలంగాణ సాధించవచ్చనే గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి సత్యవతి పేర్కొన్నారు. భారతీయ సంప్రదాయంలో దేవుడితో సమానమైన స్థానం గురువులకు ఉందని చెప్పారు. పిల్లలను బాధ్యతాయుత పౌరులుగా మార్చడంలో ఉపాధ్యాయుల కృషి గొప్పదని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక గురుకులాలు పెట్టి, నాణ్యమైన విద్యను అందిస్తున్నారు అని తెలిపారు.
విద్యావిధానంలో దేశానికే తెలంగాణ తలమానికంగా నిలవాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు.