టీచర్‌ ట్రైనింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్స్‌

హైదరాబాద్‌,జనవరి19(జ‌నంసాక్షి): దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ మహిళా సభప్రీ ప్రైమరీ టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సు నిర్వహిస్తోంది. దీని ప్రాంగణంలోని ఎస్టీవీసీ కేంద్రం ఆధ్వర్యంలో ఈ కోర్సుకు దరఖాస్తులు స్వీకరించ నున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సులో చేరేందుకు కనీసం పదవ తరగతి పాసై ఉండాలని, ఎటువంటి వయోపరిమితి లేదని చెప్పారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వ సర్టిఫికెట్‌ అందజేయనున్నట్లు వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 25వ తేదీలోగా దాఖలు చేయాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 9397824542 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.