టీజీవీపీ చలో ఢిల్లీ వాయిదా
హైదరాబాద్: తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) ఈనెల 18, 19 తేదీల్లో తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్షికమాన్ని ఈ నెల 28 అఖిలపక్ష సమావేశం జరగనుండడంతో 26, 27 తేదీలకు వాయిదా వేసినట్లు అధ్యక్షుడు భట్టు శ్రీహరి ఒక ప్రకటనలో తెలియజేశారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం, బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్, వెంకయ్యనాయుడు, ఆర్‌ఎల్డీ నేత అజిత్ సింగ్, ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోడియా, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఈ కార్యాక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు.