టీవీ నటి దీప్తి ఆత్మహత్య
హైదరాబాద్: టీవీ నటి దీప్తి(30) ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ బాలానగర్‌లోని ఫతేనగర్‌లో నివాసముంటున్న దీప్తి తన అపార్ట్‌మెంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలను వెల్లడిస్తూ.. దీప్తి అలియాస్ రామలక్ష్మీ స్వస్థలం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. ఆహ్హానం, ఆడదే ఆధారం వంటి తదితర సీరియల్స్‌లో ఆమె నటించింది. సంఘటనాస్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. శుక్రవారం అర్థరాత్రి అనంతరం తను నివాసముంటున్న అపార్ట్‌మెంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు పాల్పడుతూ ఐ ప్యాడ్‌లో సెల్ఫీ ఫోటోలను కూడా తీసుకుందని పోలీసులు పేర్కొన్నారు.