టీ-కాంగ్రెస్‌ ఇంచార్జిగా వుమెన్‌ చాందీ!?

3

న్యూఢిల్లీ,జులై 5(జనంసాక్షి):తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) ప్రక్షాళనకు ఆపార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం.  గత కొంత కాలంగా ఆపార్టీలోని నేతల పనితీరు, తెలంగాణలో రోజురోజూకూ పార్టీ బలహీనపడటం అ పార్టీని కలవరపాటుకు గురి చేస్తోంది.  ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ ఛార్జ్‌ గా ఉన్న దిగ్విజయ్‌ సింగ్‌ స్థానంలో కేరళ మాజీ ముఖ్యమత్రి ఊమెన్‌ చాందీని నియమించనున్నట్లు సమాచారం.  ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ ఛార్జ్‌ గా ఉన్న దిగ్విజయ్‌ సింగ్‌ స్థానంలో కేరళ మాజీ ముఖ్యమత్రి ఊమెన్‌ చాందీని నియమించనున్నట్లు సమాచారం. పార్టీ తెలంగాణ  నేతలతో సమావేశమైన సోనియాగాంధీ ఈ మేరకు సూచన  ఇచ్చారని  సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడొకరు వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్‌ ఆపరేషన్‌ ఆకర్షణ్‌ స్కీమ్‌ తో కాంగ్రెస్‌ బలహీనపరుస్తున్న నేపథ్యంలో ఊమెన్‌ చాందీకి పగ్గాలు అప్పగించనున్నారు. కాగా చాందీ కేరళకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. అయితే డిగ్గీ రాజా చేయలేని పనిని చాందీ చేస్తారా అన్నది అనుమానమే. ఇక్కడ కాంగ్రెస్‌ సమర్థుడైన నాయకుడి లేక కొట్టుమిట్టాడుతోంది. కెసిఆర్‌ను ఎదుర్కోనే ధీటైన నాయకుడు కాంగ్రెస్‌లో కొరవడ్డారు. దీంతో కాంగ్రెస్‌ నుంచి అంతా టిఆర్‌ఎస్‌లో చేరిపోతున్నారు.