*టెట్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష*
వనపర్తి బ్యూరో, జూన్ 12 ( జనంసాక్షి) :
జిల్లా కేంద్రంలోని టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్ (TS TET) పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష ఆదివారం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా చాణక్య పాఠశాలలో పరీక్ష జరుగుతున్న తీరును, హాజరు శాతం, కల్పించిన సౌకర్యాలను ఆమె పరిశీలించారు. పరీక్షా వివరాలు, ఓ.ఎం.ఆర్. షీట్, పేపర్ కోడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేపర్-I పరీక్షలో 9026 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా, వారిలో 8307 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని, 719 మంది గైర్హాజరయ్యారని ఆమె తెలిపారు. పేపర్-II పరీక్షలో 6634 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా, వారిలో 6134 మంది హాజరైనట్లు, 500 మంది గైర్హాజరైనట్లు ఆమె వివరించారు. టెట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని ఆమె సూచించారు. పరీక్ష అనంతరం ప్రశ్న పత్రాలను బందోబస్తుతో తరలించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యా శాఖాధికారి రవీందర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.