టేకింగ్‌లో రాజీపడని దర్శకుడు శంకర్‌


ఆర్‌సి 15 కోసం భారీగా ఖర్చు
రామ్‌చరణ్‌ ప్రస్తుతం వరుస పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సెన్సెషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో ఆర్‌సి15’ చేస్తున్నాడు. షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టంట వైరల్‌గా మారింది.శంకర్‌ సినిమాలంటేనే ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బ్జడెట్‌తో తెరకెక్కుతాయిని తెలిసిన విషయమే. శంకర్‌ అనుకున్న విజువల్‌ కరెక్ట్‌ వచ్చేంత వరకు ఎంత రిస్క్‌ అయినా తీసుకుంటుంటాడు. కేవలం కొన్ని సీన్ల కోసమే నిర్మాతలతో కోట్లు ఖర్చుపెట్టిస్తుంటాడు. ప్రస్తుతం ఆర్‌సి15లోనూ ఇదే జరుగుతుంది. ఒక యాక్షన్‌ ఎపిసోడ్‌ కోసమే మేకర్స్‌ దాదాపు రూ. 10కోట్లు ఖర్చుపెడుతున్నారని టాక్‌. ఈ ఫైట్‌ ఎపిసోడ్‌ 1000మందితో చిత్రీకరిస్తున్నారని టాక్‌. ఇటీవలే చరణ్‌ స్టైలిష్‌ లుక్‌ వీడియో విడుదలై వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అంతే కాకుండా ఈ చిత్రం దిల్‌రాజు నిర్మాణంలో 50వ సినిమాగా తెరకెక్కుతుంది. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, నవీన్‌ చంద్ర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.