ట్యాంర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్న ఆర్డీవో

మంథని గ్రామీణం: మండలంలోని అక్కిపల్లి గ్రామంలో నీటి ఎద్దడి నివారించేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని మంథని ఆర్డీవో అయేషా నుస్రత్‌ ఖానం హామీ ఇచ్చారు. గురువారం గ్రామాన్ని సందర్శించిన ఆమెకు గ్రామంలో నీటి ఎద్దడి నెలకొందని గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు.