ట్రాక్టరు బోల్తాపడి డ్రైవర్‌ మృతి

మెదక్‌: చేగుంట: కూనయ్యపల్లిలో పొలం దున్నుతుండగా ట్రాక్టరు బోల్తాపడి డ్రైవర్‌ నవీన్‌(22)మృతి చెందాడు. గ్రామంలోని ఒక రైతు పొలాన్ని ట్రాక్టరుతో దున్నుతున్న సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టరు నడుపుతున్న నవీన్‌ బురదలో కూరుకుపోయి మృతి చెందాడు. చేగుంట ఎస్సై వినాయక్‌ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.