ట్రాక్టర్‌ బోల్తా ఇద్దరి మృతి-22మందికి గాయాలు

 

మదనపల్లి:కురబలకోట మండలం తానమిట్ట వద్ద ఆదివారం ఉదయం ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. 22మంది గాయపడ్డారు. పిచ్చలవాండ్లపల్లికి చెందిన గ్రామస్థులు బోయకొండ గంగమ్మను దర్శించుకునేందుకు వెళ్తుండగా ఇంజన్‌ నుంచి ట్రాలీ విడిపోవటంతో ప్రమాదం జరిగింది. దీంతో జయమ్మ(45) సరస్వతి(40) అక్కడిక్కకడే మృతి చెందారు. క్షతగాత్రులను 108 వాహనంలో మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.