ట్రాక్టర్ బోల్తా… ఇద్దరు చిన్నారుల మృతి
ఆదిలాబాద్ : జైనాథ్ మండలం పెండెల్‌వాడలో ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా… పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ట్రాక్టర్ డ్రైవర్‌ను నిర్భంధించి దేహశుద్థి చేశారు.