ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై ఎఫ్‌ఐఆర్‌

హైదరాబాద్‌, మార్చి 20: ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించేవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించి, చలాన్లు చెల్లించని 94 మందిపై పోలీసులు తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీంతో నగరంలోని వాహనదారులకు టెన్షన్‌ పట్టుకుంది. సిగ్నల్స్‌ ఓవర్‌టేక్‌ చేయడమెందుకు.. చలాన్లు కట్టకపోవడమెందుకు.. ఎఫ్‌ఐఆర్‌ గొడవెందుకు.. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తే సరిపోతుంది కదా… అని చాలామంది వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.