ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలకు దూరం
ప్రతి ఒక్కరూ అవగాహనతో ముందుకు నడవాలి
రన్ ఫర్ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో ¬ంమంత్రి మమ్మూద్ అలీ
వరంగల్,నవంబర్7(జనంసాక్షి): ప్రతీ ఒక్కరికీ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన ఉండాలని ¬ంమంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ ఏర్పాటు చేసిన రన్ ఫర్ రోడ్ సేప్టీ కార్యక్రమానికి ¬ంమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, ట్రాఫిక్ పోలీస్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. ట్రాఫిక్, లా అండ్ అర్డర్ విషయంలో పోలీసులు అద్భుతంగా పని చేస్తున్నారని ¬ంమంత్రి చెప్పారు. హైద్రాబాద్ నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతుందన్నారు. తెలంగాణలో సేప్టీ అండ్ సెక్యురిటి ఉందని ఇతర రాష్ట్రాల వారే అంటున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నగర అభివృద్ధికి, పోలీస్ శాఖకు అధిక నిధులు కేటాయించారని అన్నారు. ప్రతి రైడర్ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు. ఇదిలావుంటే వరంగల్ జిల్లాలో నిర్వహించిన వర్చువల్ రన్‌లో 50 పోలీస్‌స్టేషన్లకు చెందిన పోలీసులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసుల వర్చువల్ రన్ ఫర్ రోడ్ సేప్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ¬ంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ… హైదరాబాద్‌లో జనాభాతో పాటు ట్రాఫిక్ కూడా పెరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులకు ముఖ్య ప్రాధాన్యత ఇచ్చారని… ట్రాఫిక్ పోలీసులు ఎండ అనకా వాన అనకా రోడ్లపై మన కోసం డ్యూటీ చేస్తున్నారన్నారు. వారిని గౌరవించుకోవాలని…ట్రాఫిక్ నియమాలు పాటించాలని తెలిపారు. దేశంలో హైదరాబాద్ పోలీసులకు మంచి పేరు ఉందన్నారు. చిన్న పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వద్దు అంటూ ¬ంమంత్రి మహమూద్ అలీ కోరారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. గత 4 సంవత్సరాలలో 40 శాతం రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు. రోడ్డు భద్రతపై అవగాహన పెరగడంతో.. సిటీలో యాక్సిడెంట్స్ తగ్గాయని కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు.