ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ పమేల  సత్పతి
 యాదాద్రి భువనగిరి బ్యూరో,  జనం సాక్షి,
జిల్లాలోని రోడ్లపై స్పీడ్ లిమిట్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్రమబద్దీకరణకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.బుధవారం నాడు కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించబడింది. జిల్లాలో దాదాపు 900 కి.మీ. పరిథి కలిగిన 76 రోడ్లలో ట్రాఫిక్ కంట్రోల్ ఏర్పాట్లను, ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించారు. కమిటీ ఆమోదం తరువాత జిల్లా గజిట్ లో పబ్లిష్ చేయడం జరుగుతుంది. అనంతరం రోడ్ల మీద స్పీడ్ లిమిట్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ కంట్రోలింగ్ చర్యలు చేపట్టడం జరుగుతుంది.స్పీడ్ లిమిట్స్ ఏర్పాటుతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అన్ని చర్యలు తీసుకోవాలని, ప్రమాదాల నివారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.కమిటీ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు సైదులు, ఆర్అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శంకరయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు బిల్యానాయక్, సురేందర్, సుశీలాబాయి, నేషనల్ హైవే డిప్యూటీ ఇఇ రవీందర్, సి.ఐ లు శివశంకర్, సతీష్, తదితరులు పాల్గొన్నారు