డబుల్స్ ఇక పై ఆడను – జ్వాల
బ్యాడ్మింటన్ డబుల్స్ కెరీర్‌కు భాగ్యనగరం స్టార్ షట్లర్ గుత్తా జ్వాల గుడ్‌బై చెప్పారు. అయితే మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆడతానని ఆమె పేర్కొన్నారు. ఇప్పటివరకు మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో కలిసి జ్వాల ఆడారు. ఇకపై అశ్విని సిక్కిరెడ్డితో కలిసి ఆడుతుందని పేర్కొన్న జ్వాల తాను ఇక మహిళల డబుల్స్ కెరీర్‌కు స్వస్తి చెబుతున్నట్టుపేర్కొన్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో మారతం మను ఆత్రితో కలిసి ఆడుతానని పేర్కొన్నారు.