డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించిన మంత్రి హరీష్ రావ్- పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.

 

కోహిర్ మండలం దిగ్వాల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేసిన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఈకార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బీబీ పాటిల్,ఎమ్మెల్యే మాణిక్ రావు, చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్. అనంతరం ఈ సందర్భంగా
మంత్రి హరీష్  మాట్లాడుతూ
హైద్రాబాద్  లోని  గేటెడ్  కమ్యూనిటీని తలపించే విధంగా   ఇక్కడ  డబుల్  బెడ్  రూమ్  ఇండ్లు ఉన్నాయి
కాంగ్రెస్  హయాంలో  ఇలాంటి  ఇండ్లు  చూసారా  అంటూ ప్రశ్నించారు.
 అప్పట్లో  డబుల్  బెడ్  రూమ్  ఇల్లు  రావాలంటే  లంచాలు  ఇచ్చేవారు .ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఒక్క పైసా ఖర్చు లేకుండా అన్ని వసతులతో రెండు పడక గదుల ఇండ్లను నిర్మించి ఉచితంగా మీ చేతుల్లో పెడుతున్నాం.టి ఆర్ ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న దని స్పష్టం చేసారు.
ఖాళీ  జాగా  వున్న  వారికి  ఇండ్లు నిర్మంచుకోవడానికి  డబ్బులు  ఇచ్చే  కార్యక్రమంను   చేపట్ట నున్నట్లు తెలిపారు.
5కోట్ల  60 లక్షల  వ్యయంతో 88 డబుల్  బెడ్  రూమ్  ఇండ్లను దిగ్వాల్ లో నిర్మించామని తెలిపారు.
156.32 కోట్ల  తో  జహీరాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి  కార్యక్రమాలు  చేపడుతున్నాము.
 మాజీమంత్రి
గీతారెడ్డి  హయాంలో  త్రాగడానికి  నీళ్లు  కూడా  లేని పరిస్థితి నెలకొందన్నారు.
 ప్రభుత్వ  ఆసుపత్రుల్లో  ప్రసూతులు, వైద్య సేవలు అందించడంలో,బూస్టర్ డోస్ ఇచ్చే విషయంలో సంగారెడ్డి  జిల్లా రాష్ట్రంలో (ప్రథమ స్థానంలో )టాప్  లో నిలిచిందని,అందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్లు,వైద్యులు,వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు.
 సీఎం  కెసిఆర్  అద్వర్యం లో  తెలంగాణా లో మంచి  వైద్యాన్ని,విద్యను  అందిస్తున్నామని తెలిపారు.
రేపటి  నుండి  రైతులకు  రైతు  బంధు  డబ్బులు  తమ ఖాతాలో  వేసి  రైతులకు  టి ఆర్ ఎస్  ప్రభుత్వం  అండగా  ఉంటుందన్నారు.
దేశంలో  కాంగ్రెస్ , బీజేపీ  పాలిత  రాష్ట్రాల్లో కూడా  తెలంగాణ  లో ఉన్నట్టు వంటి సంక్షేమ పధకాలు  ఎక్కడ  లేవని స్పష్టం చేశారు.
కోహీర్ లో 10 కోట్లతో  50 పడకల ప్రభుత్వ  ఆసుపత్రి ని నిర్మిస్తున్నాం.ఆసుపత్రిని రెండు,మూడు నెలల్లో అందుబాటులోకి తెనున్నాం.
త్వరలో సంగమేశ్వర ,బస వేశ్వర  సాగునీరు  ప్రాజెక్ట్  లతో గోదావరి  జలాలను  జహీరాబాద్  తీసుకొచ్చి ఈ ప్రాంత రైతులకు సాగునీటిని అందిస్తాం.
తెంగాణ  భూముల  రేట్లు  పెరగడానికి  కారణం  ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అని పేర్కొన్నారు.
అన్ని వర్గాల  ప్రభుత్వం  మన  కేసీఆర్ ప్రభుత్వం.కేసీఆర్ ఆధ్వర్యంలో  రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతుంది.మీ కోసం ఎవరు పని చేస్తున్నారో మీరే గుర్తించాలి.
కోహీర్ మండలం నకు సంబంధించిన స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.46.25 కోట్ల చెక్కులను అందజేశారు.