డబ్బుతో రాజకీయాలు చేసే వాళ్ళం కాదు.
ప్రజల మద్దతు తో ఉన్న వాళ్ళం.
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
నల్గొండ బ్యూరో,జనం సాక్షి
తాము డబ్బులతో రాజకీయం చేసే వారం కాదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం తెరాస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా చండూరు మండలం బోడంగిపర్తిలో ప్రచారములో పాల్గొన్న
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారం చేపట్టారు.గ్రామం లో
నేలపై కూర్చొని గ్రామస్తులు చెప్పిన సమస్యలు విన్న మంత్రి కొప్పు ఈశ్వర్.
గ్రామస్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.తాము ప్రజల మద్దతు తో ఉన్న వాళ్ళమని,
మళ్ళీ ఎన్నికలు వస్తాయి.. మళ్ళీ ఓట్లు కొన వచ్చని అనుకుంటున్నారు..
ఈ ఎన్నికలో అలాంటి వారిని ప్రజలు నమ్మరని అన్నారు.
బీజేపీ అంటేనే ఎస్సి. బిసి వర్గాల వ్యతిరేక పార్టీ అని బీజేపీ పాలనలో దళితుల పై దాడులు పెరిగాయని ఆరోపించారు.
ఫ్లోరైడ్ రహిత నీటిని అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మిషిన భగీరథ అమలు చేసి..మంచి నీటిని అందించారని వివరించారు.
రాజా గోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారు అనే విషయాన్నీ ప్రజలు నిలదీయాలని,
ఎవరి కోసం రాజీనామా చేశారని ప్రశ్నించారు
18 వేల కోట్లు ప్రాజెక్ట్ డబ్బులు నియోజకవర్గం ప్రజలకు పంచి ఇస్తాడా అనే విషయం ప్రజలు నిలాదీయాలన్నారు.ఒక్క ఓటు కూడా రాజగోపాల్ రెడ్డి కి వేయ వద్దని పిలుపునిచ్చారు.
పేదలు ముఖ్యంగా దళిత వర్గాల విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని,
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిద్దాం.సీఎం కేసీఆర్ కు బహుమతిని ఇద్దామని అన్నారు.ప్రచారంలో టిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు పల్లె రవికుమార్. కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యారి రాజేష్, పందుల రాజు, వరికుప్పల సురేష్, సత్తయ్య. రామ లింగయ్య. నర్సింహ.ముత్యాలు. మహేశ్. వర్కుల నర్సింహ మండల ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు పాల్గొన్నారు.