డయా ఫ్రంవాల్‌ పైలాన్‌ ఆవిష్కరణ

సనులపై సిఎం చంద్రబాబు ఆనందం

ఏలూరు,జూన్‌11(జ‌నం సాక్షి): పోలవరం ప్రాజెక్టులో ఒక కీలక ఘట్టం ముగిసింది. మరో ముఖ్యమైన దశ ప్రారంభంకానుంది. ప్రాజెక్టు పటిష్టతను కాపాడేలా నదీ గర్భంలో నిర్మించిన డయా ఫ్రంవాల్‌ పనులు పూర్తి అయ్యాయి. అదే సమయంలో కీలకమైన ఎర్త్‌ కమ్‌ రాఫిల్‌ అంటూ రాతి మట్టి కట్ట నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. డయా ఫ్రం వాల్‌ పనులు పూర్తి కావడంతో ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ పోలవరం ప్రాజెక్ట్‌ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు డయా ఫ్రంవాల్‌ పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాణపరంగా పోలవరం ప్రాజెక్టు మరో రికార్డు సాధించిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావు అన్నారు. స్పిల్‌ ఛానల్‌, స్పిల్‌ వే పనుల్లో ఒక్కరోజులో 11,158 క్యూబిక్‌ విూటర్ల కాంక్రీట్‌ పనులతో రికార్డు సాధించామన్నారు. దేశంలో ఏ సాగునీటి ప్రాజెక్టులో ఈస్థాయి కాంక్రీట్‌ పనులు చేయలేదని చెప్పారు. చైనా త్రీగోర్జెస్‌ డ్యామ్‌లో 24 గంటల్లో 13వేల క్యూబిక్‌ విూటర్ల కాంక్రీట్‌ పనులు జరిగాయని, జులైనాటికి చైనా రికార్డును కూడా అధిగమిస్తామని మంత్రి దేవినేని స్పష్టం చేశారు.