డల్లాస్‌ మహానాడులో పాల్గొన్న గంటా తదితరులు

ఇక్కడా తప్పని నిరసనలు
డల్లాస్‌,మే28( జ‌నం సాక్షి ):  అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన తెదేపా మహానాడులో మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురు టిడిపి నేతలు పాల్గొన్నారు. తెలుగువారి ఐక్యతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని.. అమెరికాలోనూ మహానాడును నిర్వహిస్తుండడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా గంటా పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రుల కృషి ప్రశంసనీయం అన్న ఆయన.. తెలుగుజాతి ఐక్యతతో ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావుతో పాటు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, తెదేపా సీనియర్‌ నేత పెద్దిరెడ్డి, గుంటూరు మాజీ జడ్పీ చైర్మన్‌ నాగభూషణం  తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే  డల్లాస్‌ నగరంలో తొలిసారిగా జరుగుతున్న తెలుగుదేశం మహానాడుకి నిరసనల సెగ కూడా  తగిలింది. ఎంతో మంది వస్తారని ఆశిస్తే, తీరా లోపల ఉన్న కార్యకర్తల కంటే బయట నిరసన తెలిపిన వ్యక్తులు ఎక్కువ ఉన్నారని కొందరు అన్నారు. ఇది పూర్తిగా మహానాడు నిర్వాహకుల వైఫల్యం అని అన్నారు. అమెరికా నలుమూలల నుంచి వంద మందికి పైగా తెలుగు ఎన్నారైలు మహానాడు వద్ద నిరసన తెలపడానికి వచ్చినట్లు తెలుగు ఎన్నారై ప్రత్యేక ¬దా పోరాట సమితి వెల్లడించింది. అందరూ నల్లటి దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. వచ్చిన ప్రతివారు తెలుగు దేశం ప్రభుత్వం వైఫల్యాలను సవివరంగా ఆధారాలతో సహా ఎండగట్టారు , ముఖ్యంగా ప్రత్యేక ¬దా సాధించడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందని ప్రతి ఒక్కరు అభిప్రాయపడ్డారు. ప్లకార్డులు, బ్యానర్‌ లతో విన్నూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తెలుగు ఎన్నారైలు అందరూ కలిసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభా ప్రాంగణాన్ని ¬రెత్తించారు. ఇదంతా గమనించిన ఇండియా నుండి వచ్చిన నాయకులు డల్లాస్‌ మహానాడు నిర్వాహుకులని మందలించడం గమనార్హం .
—–