డిఎస్ ఇంటిని ముట్టడించిన పిడిఎస్‌యు విద్యార్థులు
నిజామాబాద్, ఫిబ్రవరి 1 (: తెలంగాణ కోసం ప్రజలంతా ఉద్యమిస్తుంటే మాజీ పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ మౌనంగా ఉండడాన్ని నిరసిస్తూ శుక్రవారం నిజామాబాద్‌లోని ఆయన నివాసం ఎదుట పిడిఎస్‌యు విద్యార్థులు ధర్నా చేశారు. ఇంటి ముట్టడికి ప్రయత్నించగా సుమారు 25 మంది విద్యార్థులను బలవంతంగా జీపులో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. పిడిఎస్‌యు నాయకులు అన్వేష్, స్వరూపలు మాట్లాడుతూ కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణపై నిర్ణయం తీసుకోకుండా దాటవేత ధోరణి అవలంభిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలోని ప్రజా ప్రతినిధులు పార్టీపై ఒత్తిళ్లు తీసుకురాకపోవడం వల్లే కేంద్రం తెలంగాణపై నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నందని విమర్శించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యం చేశారని, మహిళలని చూడకుండా చేయిచేసుకోవడం విచారకరమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రవి, అరుణ్, విజయ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.