డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
కరీంనగర్, మార్చి 25: జిల్లాలోని కాల్వ శ్రీరామ్‌పూర్ మండలం ఊశన్నపల్లిలో ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఇదిలా ఉండగా, ఆత్మహత్యకు గల కారణాలను ఇంకా నిర్థారించలేదని పోలీసులు చెబుతున్నారు.